శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (08:55 IST)

మోదీ గో బ్యాక్ అంటే.. గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థం

నోట్ల రద్దు విషయంలో తల్లిని సైతం క్యూ లైనులో నిలబెట్టిన సంస్కృతి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. మోదీ గో బ్యాక్ అంటే గుజరాత్ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ సెటైర్ వేశారు. 
 
కియా మోటర్స్ ఏపీకి ఇచ్చామని మోదీ చెప్పడం దారుణమని.. చంద్రబాబు సారథ్యంలోనే కియా ఏపీకి వచ్చిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరో సారి మఖ్యమంత్రి కావడం ఖాయమని.. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారని శివాజీ జోస్యం చెప్తున్నారు. 
 
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. తనను కెలికితే మీ బొక్కలు మొత్తం బయటపెడతానని శివాజీ చెప్పారు. మోదీ ప్రధాని కాదని రాజకీయ తీవ్రవాది అని శివాజీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.