మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (15:19 IST)

విజయవాడుకు చేరుకున్న ముంబై నటి జైత్వానీ కాదంబరి

Kadambari Jethwani
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జైత్వానీ ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఏపీ పోలీసుల గట్టి పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఆమె ఏపీ హోం మంత్రి అనిత, డీజీపీ తిరుమల రావులను కలిసి తనకు జరిగిన వేధింపులు, అన్యాయంపై పూర్తి వివరాలు సమర్పించనున్నారు. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు విచారణాధికారిగా నియమితులైన ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కూడా ఆమె వద్ద విచారణ జరుపనుంది. 
 
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో నటిపై తీవ్రమైన వేధింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాజకీయ నాయకులతో పాటు.. ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్ఐ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దల ప్రమోయం కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడం ఈ విషయం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. 
 
తనను గత ప్రభుత్వమే బ్లాక్‌మెయిల్, వేధింపులు, కిడ్నాప్‌లు చేసిందని ఆమె మీడియా ముఖంగా ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేసించింది. ఈ కేసులో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్వరంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది.