సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 మే 2019 (19:09 IST)

నా భర్తను చంపితే లక్ష రూపాయలు.. సుపారీ ఇచ్చిన భార్య.. ఎందుకు?

చిత్తూరు జిల్లాలో కిలాడీ లేడీ బాగోతం బయటపడింది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో  కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చెందిన నాగరాజు, అతని భార్య సౌమ్య ఇద్దరు బిడ్డలతో కలిసి శాంతిపురంలో నివాసముంటున్నారు. సౌమ్యకు అదే ప్రాంతానికి చెందిన జనార్థన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం కాస్తా భర్తకు తెలిసి మందలించాడు. అయితే ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. 
 
తన భర్త అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు జనార్థన్‌తో కలిసి చంపేందుకు ప్లాన్ చేసింది. జనార్థన్, సౌమ్యలు కలిసి నాగరాజును చంపేందుకు పుంగనూరు మండలం మేలందొడ్డికి చెందిన భానుప్రకాష్, అశోక్, గంగవరం, బాబులతో లక్షరూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
గత నెల 30వ తేదీన రామకుప్పం-సగినేకుప్పం మార్గంలోని గడ్డూరు క్రాస్ వద్ద నాగరాజుపై కత్తి, బ్లేడ్లతో దాడి చేశారు. అయితే నాగరాజు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని భార్యే సూత్రధారిగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు.