శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (15:10 IST)

సీఎం జ‌గ‌న్‌ను కలుస్తాం... వక్ఫ్ బోర్డు నియామ‌కంపై చ‌ర్చిస్తాం!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అహ్లె సున్నత్ జమాత్ రాష్ట్ర కో- కన్వీనర్ అల్తాఫ్ రజా ఖాద్రి విన్నపం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ అహలె సున్నత్ జమాత్ వారిని  మాత్రమే చైర్మన్ గా, డైరెక్టర్లుగా నియమించాలని రాష్ట్రంలో ఉన్న సున్ని షియా సాంప్రదాయానికి సంబంధించిన మత గురువులు ముస్లింలు కోరుతున్నారు. 
 
 
ఇప్పటికే రాష్ట్ర వక్ఫ్ బోర్డులో పూర్తిగా అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు, అంతుచిక్కని మాఫియాలు దారుణంగా ఉన్నాయని, వక్ఫ్ బోర్డ్ భూములు పూర్తిస్థాయిలో రక్షించాలంటే ఇది సామాన్యమైన విషయం అయితే కాద‌ని అల్తాఫ్ రజా ఖాద్రి చెప్పారు. 
 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వక్ఫ్ భూములు పూర్తిస్థాయిలో కాపాడుతామ‌ని ఇచ్చిన మాట  పూర్తి స్థాయిలో అమలు జరగాలి అంటే ఐఎఎస్. అధికారులు స్పెషల్ ఆఫీస‌ర్లుగా ఉండాల‌న్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల సమక్షంలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాన్ని నియమించి, ప్రతి జిల్లాలో కఠినమైన చట్టాలు అమలు చేస్తే రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు కోట్లలో ఆదాయం వస్తుంద‌ని చెప్పారు.  

 
65వేల ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డు  సంబంధించినది ఉంద‌ని, అయినా లాభం లేద‌ని చెప్పారు. దర్గాల,  మసీదుల ముతవల్లీలు పూర్తిగా ఆర్ధకంగా వెనుకబడి ఉన్నార‌ని, వక్ఫ్ బోర్డుకు ఆదాయం రావడం లేద‌న్నారు. బాగు పడింది అక్రమంగా లీజుకు తీసుకున్న తర్వాత లంచాలు ఇచ్చి రికార్డు సృష్టించుకున్న ఆక్రమణదారుల‌ని చెప్పారు. వక్ఫ్ భూములు కబ్జా చేసిన భూ మాఫియా గ్యాంగ్ మాత్రమే కోట్ల రూపాయలు  లాభ‌పడుతున్నార‌ని, వారిని ఏ పార్టీ అధికారంలో వచ్చినా కొంత మంది రాజకీయ నాయకులు, అధికారులు కాపాడుతూనే ఉంటార‌ని చెప్పారు. 
 

రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటే, మసీదులు, దర్గాలు, పీర్ల పంజాలు, ఖాజీ మాన్యాలు భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతాయ‌ని చెప్పారు. పూర్తి స్థాయిలో రికార్డులు అన్ని ఉన్నప్పటికీ, కోర్టులలో కేసులు వక్ఫ్ బోర్డు వారు ఓడిపోతున్నార‌ని, కారణం ఏమిటో అర్థం కాద‌న్నారు. దీనిపై సీఎం జ‌గ‌న్ ని క‌లిసి పూర్తిగా వివ‌రిస్తామ‌ని అల్తాఫ్ ర‌జా చెప్పారు.