ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:51 IST)

విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

airtel
విశాఖపట్టణంలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను దశల వారీగా నగర వ్యాప్తంగా విస్తరించేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారతీ ఎయిర్‌టెల్ సీఈవోగా వ్యవహరిస్తున్న శివన్ భార్గవ్ వెల్లడించారు.
 
తొలి దశలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ముందుగా విశాఖ నగరంలోని ద్వారకా నగర్, బీచ్ రోడ్డు, డాబా గార్డెన్, మద్దిలపాళెం, వాల్తేర్ అప్‌లాండ్స్, పూర్ణా మార్కెట్, ఎంవీపీ కాలనీ, రామ్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.