శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

మా అక్క భర్తవి.. అందుకే నీ బండారం బయటపెట్టడం లేదు : కూన రవికుమార్

వైకాపా నేత తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా అక్క భర్తవి కావడంతో మీ బండారం బయటపెట్టలేక పోతున్నా. లేకుంటేనా అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీలో పుట్టి రాజకీయంగా ఎదిగిన తమ్మినేనికి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
 
శ్రీకాకుళంలో రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ, 'మా అక్క భర్తవి కాబట్టే మీ బండారం బయటపెట్టడం లేదు. నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివో గుర్తుంచుకో' అంటూ హెచ్చరిక చేశాడు. టీడీపీలో పుట్టి, రాజకీయంగా ఎదిగిన తమ్మినేని సీతారాంకు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఏమాత్రం లేదన్నారు. 
 
ప్రతిపక్ష నేతగా శ్రీకాకుళం జిల్లాలో తిరిగే నైతికత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి  లేదని రవికుమార్ అన్నారు. ఫ్యాక్షనిస్టు, మాఫియా నేత, కబ్జాకోరు అయిన జగన్ తనను తాను నీతిమంతుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్‌ను వేలెత్తి చూపించి, విమర్శించగల దమ్మున్న నాయకుడిని తాను ఒక్కడినేనని కూన రవికుమార్ ప్రకటించారు.