బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (11:43 IST)

అమరావతి అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్స్‌.. శరవేగంగా పనులు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం వేగాన్ని పెంచింది. అమరావతికి కావాల్సిన సకల సదుపాయాలపై వ్యూహరచనతో ముందుకెళ్తోంది. హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల రూపకల్పన, రహదారులు, మౌలిక సదుపాయాల

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం వేగాన్ని పెంచింది. అమరావతికి కావాల్సిన సకల సదుపాయాలపై వ్యూహరచనతో ముందుకెళ్తోంది. హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల రూపకల్పన, రహదారులు, మౌలిక సదుపాయాలు, లే అవుట్ల టెండర్ల ఖరారు వంటి కీలకాంశాలపై కసరత్తు చేస్తోంది.
 
అంతేకాకండా, అమరావతి అభివృద్ధి నిర్మాణంలో మాస్టర్‌ ప్లాన్స్‌ రూపొందిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లలో అసెంబ్లీ, హైకోర్టుల ఫైనల్‌ డిజైన్‌లను ఖరారు చేయనుంది. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్‌ పోస్టర్ కొన్ని వారాల క్రితం ఇచ్చిన డిజైన్లపై అంసతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాజమౌళిని సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కలసి లండన్‌కు తీసుకెళ్లి, నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. 
 
అదేసమయంలో భారీ ఉద్యాన వనాలు, కృష్ణానదిపై గవర్నమెంట్ కాంప్లెక్స్-పవిత్ర సంగమం ప్రదేశాన్ని కలుపుతూ నిర్మించదలచిన ఐకానిక్ బ్రిడ్జితోపాటు సీడ్ యాక్సెస్ రహదారి, గ్రీనరీ పనుల విషయంలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుప్రసిద్ధ హోటల్ గ్రూపులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సీఆర్డీఏ చర్చలు జరిపి ఓ కొలిక్కి తేనున్నారు. అలాగే రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించనున్నారు.