సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (13:36 IST)

తిరుమల అన్నప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసల జల్లు.. అద్భుతమంటూ వీడియో పోస్ట్ (video)

Ambati Rambabu
Ambati Rambabu
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమలలో  అన్నప్రసాదాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అన్నప్రసాదం నిర్వహణ అద్భుతంగా వుందని.. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు రుచికరంగా, పరిశుభ్రంగా ఉన్నాయని కితాబిచ్చారు. 
 
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అందరితో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి వెళ్లారు. అక్కడ అందించిన భోజనాన్ని కేవలం ఆహారంగా కాకుండా, సాక్షాత్తూ భగవంతుడు అందించిన ప్రసాదంగా ప్రశంసించారు. 
 
ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసాదం స్వీకరించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సాధారణ రోజుల్లోనే ప్రతిరోజూ దాదాపు 90,000 మంది భక్తులకు తిరుమలలో అన్నప్రసాదం అందిస్తున్నారన్నారు మాజీమంత్రి అంబటి రాంబాబు. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక పండుగ సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అప్పుడు లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల మంది వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని అంబటి రాంబాబు చాలా ఆశ్చర్యపోయారు. 
 
ఈ అనుభవాన్ని వివరిస్తూ.. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత అంబటి తిరుమల యాత్రపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.