గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 4 జూన్ 2025 (15:10 IST)

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

police officer angry at Ambati Rambabu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తామంటూ అందుకోసం నాయకులు రోడ్డెక్కి నిరసన చేసేందుకు కదిలారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రోడ్డుపైకి వచ్చి నిరశన తెలియజేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, అంబటి రాంబాబుకి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
 
పోలీసు అధికారి వంక చూస్తూ అంబటి రాంబాబు గట్టిగా పళ్లు కొరుకుతూ వుండటంతో చిర్రెత్తిపోయినా పోలీసు అధికారి.. ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, పోలీసుల డ్యూటీకి అడ్డు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.