1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (16:11 IST)

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది..

ambati rambabu
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. 
 
2019లో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు.. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాప్తాడు సభలో సీఎం జగన్ ఆరోపణలు చేయడంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా స్పందించారు.
 
 
కాగా, చంద్రబాబు సవాల్‌పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు సరదాగా స్పందించారు. కాగా, చంద్రబాబు చాలెంజ్‌పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. "డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్" అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.