ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2024 (08:41 IST)

రాజకీయాల్లో పట్టు: చంద్రబాబు ఇంట శ్యామల యాగం

Chandra babu Naidu
ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు రోజుల రాజ శ్యామల యాగం ప్రారంభమైంది. తొలిరోజు శుక్రవారం పూజ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఆదివారం పూర్ణాహుతితో పూర్తికానున్న మూడు రోజుల రాజ శ్యామల యాగంలో భాగంగా 50 మంది ఋత్విక్కులు వివిధ పూజలు నిర్వహించారు.
 
ఈ రాజ శ్యామల యాగం ద్వారా విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాన్ని నిర్వహిస్తారు.
 
ముఖ్యంగా రాజకీయాలలో ఉన్నవారు అధికారం కోసం చేసే యాగం ఈ రాజ శ్యామల యాగం. టిడిపి అధినేత చంద్రబాబు మాత్రమే కాకుండా, గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజశ్యామల యాగాన్ని చేశారు.