క‌రోనాను సంక‌ల్పంతో ఓడిద్దాం: తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

amith shah
ఎం| Last Updated: బుధవారం, 25 మార్చి 2020 (22:55 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు సంవ‌త్స‌రాది శుభాకాంక్ష‌లు చెప్పారు. బుధ‌వారం ఉగాది శుభాకాంక్ష‌లు చెబుతూ ఆయ‌న తెలుగులో ట్వీట్ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ ఉగాది అంద‌రికీ మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు అమిత్ షా.

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో మ‌న‌మంతా ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించ‌డం ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని ఓడించ‌డానికి ఒక సంక‌ల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.


దీనిపై మరింత చదవండి :