Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా ముందుకు ఆనందయ్య.. అనధికారికంగా మందు తయారీ..

Written By ఠాగూర్
Published: బుధవారం, 26 మే 2021 (10:10 IST)
కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్యతో అనధికారికంగా మందును తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏబీఎన్ చేతికి కీలక ఆధారాలు లభించారు. అలాగే మందు తయారీకి సంబంధించి వీడియోలు చిక్కాయి. 
 
కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్‌బ్లాక్‌లోనే పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ప్రతి రోజు వేల మందికి సరిపడే మందుని మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా తయారు చేయుస్తున్నట్లు సమాచారం. బక్కెట్ల కొద్ది మందుని సీఎం, మంత్రులు, ఎమ్మాల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకి  సరఫరా అవుతున్నట్లు సమాచారం. 
 
తెలంగాణ, ఢిల్లీకి సైతం కార్లలో తరలిస్తున్నారు. ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేస్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ జరుగుతోంది. ఆనందయ్యని వంట మాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, ఆనందయ్యను మీడియా ముందుకు తీసుకునిరావాలని ప్రజలతో పాటు.. విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అధికార పార్టీ నేతలు మాత్రం పోలీసుల వలయంలో ఉంచారు. అక్కడే ఆయన అనధికారికంగా మందును తయారు చేసి ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments