బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 25 మే 2021 (15:41 IST)

సి.ఎం. కావాల‌ని వుంద‌న్న ఉపేంద్ర‌

Upendra
సినిమా స్టార్స్‌కు ఆయా రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని దాని ద్వారా ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని కోరిక వుండ‌డం స‌హ‌జ‌మే. ఇలా ప‌లు రాష్ట్రాల‌లో అక్క‌డ బాగా ఫేమ‌స్ అయిన క‌థానాయకులు, నాయ‌కురాళ్ళు ముఖ్య‌మంత్రి అయిన దాఖ‌లాలు చూశాం. కొన్నిసార్లు పార్టీ పెట్టి మ‌ర‌లా వెన‌క‌డుగు వేసిన వారిని కూడా చూశాం. ఇవ‌న్నీ బేరీజు వేసుకున్న క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర కూడా త‌న కోరిక‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
 
భిన్న‌మైన క‌థ‌లు, పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ఉపేంద్ర ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న షూటింగ్ లేక ఇంటి వ‌ద్ద‌నే వున్నారు. మ‌రి ఖాళీగా వుండ‌డం వ‌ల్ల‌నేమో క‌రోనా టైంలో నాకు ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని కోరిక పుట్టింద‌ని తెలియ‌జేశారు. నాకు సి.ఎం. కావాలని వుంది. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డితే గెలిపిస్తారా! అని ఓ సందేశాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాక సి.ఎం. అనే ప‌దానికి స‌రైన నిర్వ‌చ‌నం ఇస్తాను. ప్ర‌జ‌ల నిర్ణ‌య‌మే త‌న నిర్ణ‌యం అని ముగింపు ఇచ్చాడు. 
 
మ‌రి క‌రోనా కాలంలో ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న వైఖ‌రి న‌చ్చ‌క కామేన్ మేన్ కూడా నేనే సి.ఎం. అయితే? ఇలా చేస్తాను? అలా చేస్తాను? అని అనుకోవ‌డం దేశంలో మామూలైపోయింది. అయితే ఉపేంద్ర గ‌త కొన్నేళ్ళుగా పొలిటిక‌ల్ పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి రావాల‌నే చూశారు. అప్ప‌ట్లోనే ప్ర‌జ‌ల‌కు మంచి విద్య‌, వైద్యం అందించాల‌ని వుంద‌నే స్టేట్ మెంట్ ఇచ్చాడు. మ‌రి క‌రోనా కాలంలో వ‌చ్చిన ఆలోచ‌న కార్య‌రూపం దాల్చ‌డానికి ప్ర‌జ‌ల స‌పోర్ట్ కావాలి. మ‌రి ప్ర‌జ‌లు ఏమి చేస్తారో చూడాలి.
ఇక ఉపేంద్ర తెలుగులో వ‌రుణ్‌తేజ్ తో `గ‌ని` సినిమా చేస్తున్నాడు. అది బాక్సింగ్ నేప‌థ్యంలో సాగుతోంది. ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే వుంది.