మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (17:05 IST)

నెలకు రూ.లక్ష సంపాదన... సుహానానిచ్చి పెళ్లి చేయండి.. గౌరీఖాన్‌కు నెటిజన్ ప్రశ్న

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ - గౌరీఖాన్‌ల ముద్దుల కుమార్తె సుహానా. ఈమె ఈ నెల 22వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈమె సినీ రంగ ప్రవేశం చేయలేదు. అయినప్పటికీ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. 
 
నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌‍గా ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె తల్లి గౌరీ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరీఖాన్ పోస్టుకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది.
 
అయితే వాటిలో ఓ కామెంట్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. తాను బాగానే సంపాదిస్తున్నానని, తనను అల్లుడిగా చేసుకోవాలంటూ సుహైబ్ అనే నెటిజన్ గౌరీఖాన్‌ను కోరాడు. "గౌరీ మేడమ్... సుహానాతో నా పెళ్లి చేయండి... నా నెలజీతం లక్షకు పైనే ఉంటుంది" అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట సందడి చేస్తోంది. దీనికి గౌరీ ఖాన్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.