శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (16:41 IST)

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్పష్టత ఇవ్వాలి : సర్కారుకు హైకోర్టు ఆదేశం

విశాఖపట్టణానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని కోరుతూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్‌లో పేర్కొంది. 
 
దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది.. పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు. ఈ మేరకు రిజిస్ట్రీలో దరఖాస్తు ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. 
 
భార్యాభర్తల మధ్య గొడవ - ట్రిపుల్ మర్డర్ - ఆత్మహత్య  
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరకు ముగ్గురి హత్యకు.. ఓ ఆత్మహత్యకు దారితీసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం యూపీలోని బల్లియా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బల్లియా జిల్లా బన్స్‌‍దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సభ దేవ్‌డిహ్‌లో తోటలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్టు గుర్తించారు. వీరి గొంతులను పదునైన ఆయుధంతో కోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతదేహాలకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు దేవ్‌డిహ్‌కు చెందిన మోహన్‌ రాయ్ కుమారుడు శ్రవణ్ రామ్‌గా గుర్తించారు. అతని భార్య శశికళా దేవి (35), వారి ఇద్దరు పిల్లలను శ్రవణ్ పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై శ్రవణ్ రామ్ బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుందని, దీంతో ఆవేశానికి లోనైన శ్రవణ్ రామ్... ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.