గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (16:45 IST)

వ్యవసాయమే ఊపిరిగా... రైతు సంక్షేమమే : వ్యవసాయ బడ్జెట్

సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి.. విరామ సమయాల్లో కూడా సేద్యమే జీవన నేపథ్యంగా ఎంచుకున్న విలక్షణ నేత డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఆయన గురువారం శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక సందర్భమనే చెప్పాలి.
 
వ్యవసాయమే ఊపిరిగా సాగే కృష్ణదాస్, రైతు సంక్షేమమే తన శ్వాసగా మార్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ బడ్జెట్లో అన్నదాతల ఆశల సాకారం జరిగింది.
 
వ్యవసాయమే జీవన నేపథ్యమైన ధర్మాన కుటుంబం శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉన్న పోలాకి మండలం మబగాంలో అందరికీ నిత్య సుపరిచితం. ఆయన తండ్రి దివంగత ధర్మాన రామలింగంనాయుడు ఆనాటి నరసన్నపేట తాలూకాలోనే పేరెన్నికగన్న మోతుబరి రైతు. ఆయన తదనంతరం తల్లి సావిత్రమ్మ తన చివరి ఊపిరి వరకు వ్యవసాయాన్ని ఇతరుల కోసం సాయంగా భావించారు. 
 
కృష్ణదాస్ చదువుకున్న రోజుల నుంచీ మంచి వాలీబాల్ క్రీడాకారునిగా గుర్తింపు పొందారు. యుక్తవయసులో తన క్రీడాప్రతిభతో జాతీయ స్థాయిలో కూడా రాణించారు. సెయిల్ లో ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్లినా ఆ సమయంలో కూడా వ్యవసాయానికి ఎన్నడూ ఆయన దూరం కాలేదు. 
 
2004 ఎన్నికల ముందు 2003లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపుమేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన దాసన్న నేటి వరకూ వెనుదిరిగి చూడలేదు. ఉప ఎన్నికలతో కలుపుకొని నాలుగు పర్యాయాలు నరసన్నపేట శాసనసభ్యునిగా ఎన్నికయిన తర్వాత కూడా ఆయన వ్యవసాయానికి దూరంగా వెళ్లకపోవడం విశేషం.
 
ఇప్పటికీ సమయం దొరికితే పొలంలో.. కల్లంలో.. లేదా కనీసం పెరట్లో నైనా వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. వ్యవసాయంలో వస్తున్న నూతన మార్పుల గురించి, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునే ఉంటారు. పాడి అన్నా పంట అన్నా ఆయనకు మిక్కిలి ప్రేమ. 
 
రాజకీయాల్లో లేకపోయి ఉంటే తాను సేద్యమే చేసేవాడినని తన సన్నిహితులు ఎదుట  ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. వ్యవసాయమనే కాదు ఆయన గొప్ప మానవతా వాది. అంకితభావం గల నేత కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 
 
అంతటితో ఆగకుండా ఆయనకు ఉపముఖ్యమంత్రి హోదాను అందించారు. విలువలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆయనకు కీలకమైన రెవిన్యూ శాఖను అప్పగించారు. ఒక రైతును ఉప ముఖ్యమంత్రిగా నిలిపిన ప్రశంసనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాగా, ఆ గౌరవాన్ని సొంతంచేసుకున్న నేతగా ధర్మాన కృష్ణదాస్ గుర్తింపు పొందారు.
 
అటువంటి విలక్షణ నేత కృష్ణదాస్ గురువారం శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం చేశారు. తనకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడానికి తోడ్పాటు నందించిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఆయన  ప్రసంగంలో వ్యవసాయ బడ్జెట్ హైలెట్స్ ఇవి...
 
వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ కోసం రూ.17,030 కోట్లు
సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.573 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ.1,252 కోట్లు
పంట నష్ట పరిహారం కోసం రూ.1,038 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.4,761 కోట్లు
ఉచిత విద్యుత్తు కోసం రూ.17,430 కోట్లు
విద్యుత్ ఫీడర్ల చానెళ్ల సామర్థ్య పెంపునకు రూ.1,700 కోట్లు
శనగ పంట క్యాష్ సబ్ వెన్షన్ కసం రూ.300 కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.1,224 కోట్లు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూపాయిన్నరకే సరఫరా చేయడానికి రూ.1,520 కోట్లు
గత ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం రూ.2,771
వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల మాఫీ కోసం రూ.688 కోట్లు
విత్తన బకాయిలు రూ.384 కోట్లు
ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.960 కోట్లు
పంటల బీమా బకాయిల కోసం రూ. 716 కోట్లు
రైతుల పరిహారం కోసం రూ.23 కోట్లు