గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 17 జులై 2019 (14:44 IST)

గేటు పక్కన బాబు ఫోటో... రూ. 3కోట్లా? ఏంటి అధ్యక్షా ఇదీ? ఏపీ అసెంబ్లీలో జబర్దస్త్ షో...

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతారోనన్న సందేహాలుండేవి. కానీ వీళ్ల మాటల దాడి మామూలుగా లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తమ మాటలతో ఆటాడేసుకుంటున్నారు. చెప్పాలంటే... సెటైర్లతో, వ్యంగ్యాస్త్రాలతో నవ్వులు పూయిస్తూ, విమర్శనాస్త్రాలు సంధిస్తూ జబర్దస్త్ కామెడీ షోని తలపిస్తున్నారు. 
 
ఇకపోతే బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ... ప్రాజెక్టుల పేరుతో కోట్లకు కోట్లు గత ప్రభుత్వం తమ అనుయాయులకి అప్పజెప్పిందంటూ ఆరోపించారు. చంద్రబాబు అనుభవమంతా దోచుకోవడానికే పనికొచ్చిందని సెటైర్లు వేశారు. 
 
గేటు పక్కన చంద్రబాబు నాయుడు ఓ ఫోటో దిగి దాన్ని ప్రకటన ఇచ్చేందుకు రూ. 3 కోట్లు ఖర్చుపెట్టారనీ, ఈ ఒక్క ఉదాహరణ గత ప్రభుత్వం చేసిన దోపిడీ చెప్పేందుకు అని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడం పక్కనుంచి ప్రాజెక్టు వ్యయాన్ని ఎంతమేరకు పెంచి దోచుకుందామనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు ఆలోచన సాగిందంటూ ఆరోపించారు మంత్రి అనిల్.