శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (08:44 IST)

శ్రీకాకుళం మద్యం దుకారణంలో చోరీ.. మద్యం బాటిళ్లు అపహరణ

liquor sales
ఏఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఓ మద్యం దుకారణంలో భారీ చోరీ జరిగింది. ఈ దుకారణంలో ఏకంగా 11.57 లక్షల రూపాయల విలువ చేసే మద్యం దుకాణాలను దొంగలు అపహరించారు. ఇద్దరు సెక్యూరిటీగార్డులను బంధించి ఈ చోరీకి పాల్పడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. 
 
జిల్లాలోని లావేరు మండలం, మురపాక గ్రామ పంచాయతీ యూనియన్ పరిధిలోని గుంటుకుపేట అనే గ్రామంలో సోమవారం అర్థరాత్రి 2 గంటల తర్వాత ఒక వ్యానులో మద్యం దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది దుండగులు సెక్యూరిటీ గార్డు ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి బంధించారు. 
 
ఆ తర్వాత మద్యం దుకాణం తలుపులు ధ్వంసం చేసి 7087 మంది సీసాలను అపహరించారు. వీటి విలువ రూ.11.57 లక్షలుగా ఉంటుంది ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.