మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (13:40 IST)

పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగం సక్సెస్..

ISRO
ISRO
ఇస్రో తాజా ప్రయోగం సక్సెస్ అయ్యింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం 11.56 గంటలకు నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
 
ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ-సీ54 తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. 
 
ఈవోఎస్ 06 (ఓషన్ శాట్ 03) అనే ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపింది. ఇందులో మూడు దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు ఉన్నాయి.