బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (17:43 IST)

ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో చలిగాలులు

Rains
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా శనివారం నుంచి ఏపీతో పాటు తెలంగాణలో చలిగాలులు మరింత పెరిగే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.