1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (14:15 IST)

చీకట్లోనే చిన్నారికి గుండె చికిత్స.. వీడియో వైరల్

operation
చీకట్లోనే చిన్నారికి గుండె చికిత్స చేసిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. రష్యా క్షిపణులు రాజధాని నగరంలో విద్యుత్ లేకుండా చేయడంతో ఉక్రేనియన్ వైద్యుల బృందం కీవ్‌లోని ఆస్పత్రిలో చీకట్లోనే చిన్నారి గుండె శస్త్రచికిత్స చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకు ట్విట్టర్‌లో బాగా స్పందన వస్తోంది. ఈ వీడియోలో ఫుటేజీలో శస్త్రవైద్యుల బృందం బ్యాటరీ లైట్‌తో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చూపించింది. సర్జన్ల హెడ్‌ల్యాంప్‌లు కాకుండా, చీకటి గదిని కప్పేసింది. వందలాది మంది ట్విట్టర్ వినియోగదారులు వైద్యులను హీరోలుగా ప్రశంసించారు.