సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (15:11 IST)

మరో ఆరు నెలల పాటు జగనన్న సురక్ష పథకం కొనసాగింపు..

jagananna suraksha
ఏపీలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత యేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో తొలి విడతగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రెండు దశలో భాగంగా మరో ఆరు నెలల పాటు నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. 
 
వచ్చే ఆరు నెలల పాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ వైద్య సేవలను అందించే విషయంలో ఓ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో ముందుకు సాగాలే చర్యలు తీసుకోనున్నారు. 
 
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం జగన్.. తొలి దశలో 50 రోజులకు పైగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 60 లక్షల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందుతారు. తొలిదశ కార్యక్రమంలో పీహెచ్‌సీలు, ఏఎన్ఎంలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 1,45,35,705 ఇళ్లను సందర్శించి రోగులను ఇంటి ముంగిటలోనే 6,45,06,018 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.