మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (19:59 IST)

ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు ఖరారు - రేట్ల వివరాలు ఇవే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం నాన్ ఏసీ థియేటర్, ఏసీ థియేటర్, మల్టీప్లెక్స్‌లలో వారీగా టిక్కెట్ ధరలను పెంచింది. ప్రతి థియేటర్‌లోనూ ప్రీమియర్, నాన్ ప్రీమియం కేటగిరీలుగా టిక్కెట్ రేట్లను విభజించింది. 
 
ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాన్ ఏసీ థియేటర్‌లో సినిమా టిక్కెట్ ధరలు రూ.60, రూ.40, ఏసీ థియేటర్‌లో రూ.100, రూ.70, స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100, మల్టీ ప్లెక్స్‌లలో రూ.150గా సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసింది. ఒక వేళ రిక్లయినర్ సీట్లు ఉంటే రూ.250గా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టం చేసింది.
 
అలాగే, మున్సిపాలిటీలలో నాన్ ఏసీ థియేటర్‌లో రూ.50, రూ.30, ఏసీ థియేటర్‌లో రూ.80, రూ.60, స్పెషల్ థియేటర్‌లో రూ.100, రూ.80, మల్టీప్లెక్స్‌లలో రూ.125గా నిర్ణయించింది.
 
ఇకపోతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే థియేటర్లలో (సి, డి సెంటర్లు) నానా ఏసీ థియేటర్‌లో రూ.40, రూ.20, ఏసీ థియేటర్‌లో రూ.70, రూ.50, స్పెషల్ థియేటర్‌లో రూ.90, రూ.70, మల్టీప్లెక్స్‌లలో రూ.100గా సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించింది.