1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గుంటూరు మున్సిపల్ ఎన్నికలు : ప్రభావం చూపని తెదేపా

గుంటూరు నగరపాలక సహా ఐదు మున్సిపాల్టీలను అధికారపార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. డివిజన్‌లో టీడీపీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే ఓటింగ్ శాతం తగ్గిందా? పెరిగిందా? అన్నది ఈ సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉంది. 
 
గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లతోపాటు ఐదు మున్సిపాల్టీలతో కలిపి 290 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. కేవలం 35 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాదించారు. బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు ఖాతా తెరవలేదు. 
 
గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. అధికారపార్టీకి సంబంధించి ఇద్దరు మంత్రులు, ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు గుంటూరు నగరపాలక సంస్థలోనే తిష్టవేశారు. 
 
టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థి రవీంద్ర, తూర్పు ఇన్చార్జ్ నజీర్‌లు మినహా టీడీపీ నేతలు ఎవరూ ఇక్కడ దృష్టి సారించలేదు. కనీసం ప్రచారం చేయడానికి కూడా రాలేదు. దీంతో ఇక్కడ టీడీపీ ప్రభావం చూపలేకపోయింది.
 
ఇదిలావుంటే, ఏపీలో 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటంగ్‌లో 6 కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, గుంటూరు, ఒంగోలు. మొత్తంగా చూస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది.