శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:58 IST)

కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు.. ఎక్కడ?

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు. ఈ హత్యతో కాకినాడలో కలకలం రేగింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్‌కు కొందరితో పాతకక్షు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఆయన వెళుతుండగా, కారుతో ఢీకొట్టి హతమార్చారు. 
 
సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి మద్యం సేవించిన అనంతరం చిన్నా, రమేష్‌ ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు.