సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:18 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 50, తెలంగాణలో 157 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,605 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,161 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.
 
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 29,666 మందికి కరోనా పరీక్షలు చేయగా 157 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 163 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988కి చేరింది. ఇప్పటివరకు కోవిడ్-19తో 1,613 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,92,578 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 729 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 27 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.