శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 మే 2016 (10:09 IST)

ప్రత్యేక హోదా ఒక్కరోజులో తేలేదికాదు.. కేంద్రం నిధులపై శ్వేతపత్రం అక్కర్లేదు : యనమల

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించే అంశం ఒక్కరోజులో తేలేది కాదనీ ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమనల రామకృష్ణుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇపుడే కాదు.. ఎన్నిటికా రాదనీ బీజేపీ తేల్చి చెప్పిన నేపథ్యంలో.. దీనిపై యనమన స్పందించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామన్నారు. పైగా.. ఇది ఒక రోజులో తేలిపోయే వ్యవహారం కాదన్నారు. 
 
ఇకపోతే.. కేంద్ర ప్రభుత్వం కూడా వీలైనంత మేరకు నిధులను విడుదల చేస్తోందన్నారు. 'విభజన హామీల్లో భాగంగా గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చినవి రూ.6,400 కోట్లు మాత్రమే. కొన్ని విషయాల్లో మిగతా రాష్ట్రాల కంటే మనకు తక్కువ నిధులే వచ్చాయి. కేంద్ర నిధులను దుర్వినియోగం చేయడం లేదు. వాటిపై శ్వేతపత్రం అక్కర్లేదని యనమల చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. ప్రత్యేక హోదాపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందన్నారు. ఈ తీర్మానికి ప్రతిపక్ష నేతలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. అయితే కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం సృష్టించి కేంద్రంతో ఉన్న సంబంధాలు తెగేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఇద్దరినీ కూర్చోబెట్టి సమన్యాయం చేయాలని ఆరోజున చెప్పడం జరిగిందని, ఆదాయం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ముందే అంచనా వేశామని యనమల చెప్పుకొచ్చారు.