శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (11:01 IST)

ఏపీలో నాలుగైదు గంటల్లో దంచికొట్టుడు వానలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అవి కూడా మరో నాలుగైదు గంటల్లో దంచికొడుతూ వర్షం పడనుంది. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల వాసులను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 
 
రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 
 
అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఐఎండీ సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కన్నబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పసుపు జెండా హెచ్చరిక చేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెల్సిందే.