పనిచేయని జగన్ బుజ్జగింపులు... వైకాపాకు బుట్టా రేణుక గుడ్‌బై..?
పార్టీ మారొద్దనీ, వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం మీకే కేటాయిస్తానంటూ తమ పార్టీ ప్రజాప్రతినిధులకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన... ఇస్తున్న హామీలు ఏమాత్రం పని చేయడం లేదు. దీంతో పార్టీ
పార్టీ మారొద్దనీ, వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానం మీకే కేటాయిస్తానంటూ తమ పార్టీ ప్రజాప్రతినిధులకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన... ఇస్తున్న హామీలు ఏమాత్రం పని చేయడం లేదు. దీంతో పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఈ కోవలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా చేరనున్నారు. ఈమె మంగళవారం టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె భర్త నీలకంఠం టీడీపీలో చేరినా ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు.
ఇటీవల పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రంగంలోకిదిగి బుజ్జగించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం. స్పందించిన జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి నిరాకరించిన రేణుక తాను లోక్‌సభకే పోటీ చేస్తానని జగన్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
అదేసమయంలో కర్నూలు ఎంపీ సీటును రేణుకకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్ట ప్రచారం జరగుతోంది. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదానిని ఓసీలకు, రెండో దానిని బీసీలకు టీడీపీ ఇస్తూవస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా అవలంబించారు. ఎంపీ సీటును బీటీ నాయుడికిఇచ్చారు. రేణుక కనుక టీడీపీలో చేరితే వచ్చేసారి ఆ సీటు ఆమెకే ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో ఆమె చేరికతో ఆ పార్టీలో చేరిన వైసీపీ ఎంపీల సంఖ్య మూడుకు చేరుకుంటుంది.