శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:36 IST)

ఎస్ఈసీకి పోటీగా వైకాపా సర్కారు ప్రత్యేక యాప్: పేరు ఈ-నేత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల ప్రచారం ముగింది. ఈ నెల7వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫిర్యాదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది. అదేసమయంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యం ఫిర్యాదులకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ- నేత్రం పేరుతో ఆ పార్టీ యాప్‌ను విడుదల చేసింది. 
 
ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేసే సౌలభ్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.
 
ఇదిలాఉండగా ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రత్యేక యాప్‌ తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను విడుదల చేయగా.. దీనికి కౌంటర్‌గానే వైసీపీ మరో యాప్‌ రూపొందించినట్లు చర్చ నడుస్తున్నది.