శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:53 IST)

మార్చి 4 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ పరీక్షలు

ఆంధ్ర యూనివర్సిటీ, అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల పరిధిలో ఇంజినీరింగ్‌ పరీక్షలను మార్చి 4 నుంచి నిర్వహించనున్నట్లు అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ జె.ఆదిలక్ష్మి పేర్కొన్నారు.

బిటెక్‌, బిఆర్క్‌, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ మూడో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 4 నుంచి, రెండవ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి, నాలుగో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు, బిఆర్క్‌ ఐదవ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 26 నుంచి, బిఆర్క్‌ నాలుగో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంటెక్‌ మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి ఉంటాయని పేర్కొన్నారు.

ఎంసిఎ మూడో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌, ఎమ్మెస్సీ (సిఎస్‌) రెండో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి, ఎంసిఎ రెండో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి, ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ అప్లయిడ్‌ కెమిస్రీ ఐదో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ మార్చి 4 నుంచి, నాలుగో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌, ఎమ్మెస్సీ అప్లయిడ్‌ కెమిస్ట్రీ రెండో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి, ఇంటిగ్రేటెడ్‌ అప్లయిడ్‌ కెమిస్ట్రీ మూడో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 22 నుంచి, రెండో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.