ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:07 IST)

నేటి నుంచి అంతర్వేది ఆలయ దర్శనాలు

ఇటీవల వివాదాలు నెలకొన్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనాలను సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు.

ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులు పునఃసమీక్షించి దర్శనాలు తిరిగి ప్రారంభించామని నిర్ణయించారు. ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో రావాలన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని తెలిపారు.