పదో తరగతి చదివితే చాలు.. అంగన్‌వాడీల్లో కొత్త ఉద్యోగాలు
పదో తరగతి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. 10వ తరగతి అర్హతతో ఏపీలోని ఈ జిల్లాలో 201 అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా అభివృద్ధి- శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. నాలుగు జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ మొదలైంది. పదవ తరగతి అర్హతతో సొంత గ్రామంలో.. పరీక్షలు లేకుండా ఉద్యోగం చేయవచ్చు. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.