గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (12:16 IST)

ఇకపై అంగన్ వాడీ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్

Jobs
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ ఉద్యోగ పోస్టులకు ఉన్న కనీస విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా ఉండగా, ఇపుడు దీన్ని ఇంటర్‌కు పెంచారు. అలాగే, వయసును కూడా తగ్గించింది. ఇప్పటివరకు 21 యేళ్లు నిండినవారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉండగా, ఇపుడు దీన్ని 18 యేళ్లకు తగ్గించారు. 
 
అలాగే, గరిష్ట వయోపరిమితిని కూడా 35 యేళ్లకు పెంచారు. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, రిటైర్మెంట్ వయస్సు మాత్రం యేళ్ళకు మించకూడదని పేర్కొంది. 
 
పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా వీరిని నియమించుకోవచ్చని తెలిపింది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం పోస్టులను ఐదేళ్లతో పాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలన్న నిర్ణయించారు. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో  శాతాన్ని ఐదేళ్ళ అనుభవం ఉన్న టీచర్‌తోనే భర్తీ చేయాలని సూచించింది.