ఆ మహమ్మారి నుంచి ఖచ్చితంగా బయటపడతాం: ఎపి శాసనసభ స్పీకర్

Tammineni
జె| Last Modified గురువారం, 2 జులై 2020 (20:41 IST)
వేంకటేశ్వరస్వామి దయ వల్ల ప్రపంచం త్వరలో కరోనా వైరస్ నుంచి బయటపడుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు ఎపి శాసనసభ స్పీకర్. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కరోనా నేపథ్యంలో టిటిడి అధికారులు అన్ని జాగ్రత్తలు అమలు చేస్తూ భక్తులకు స్వామివారి దర్సనం చేయిస్తున్నారని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా రోజుకు దాదాపు 10వేల మంది భక్తులు సంతోషంగా స్వామివారిని దర్సించుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. త్వరలో తిరుమల పూర్వస్థితికి వచ్చి భక్తులతో కళకళాడుతుందన్నారు. ఆ తరువాత నాదనీరాజన వేదికపై టిటిడి నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు ఎపి శాసనసభ స్పీకర్.దీనిపై మరింత చదవండి :