బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (20:23 IST)

ఈ నెల 11న ఏపీ కేబినెట్ భేటీ

ఈ నెల 11న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని మొద‌టి బ్లాకులో ఆ రోజున ఉద‌యం 11 గంట‌లకు రాష్ట్ర మంత్రివ‌ర్గం భేటీ కానుంది.

ఈ ‌నేప‌ధ్యంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ విభాగాల‌కు సంబంధించిన ప్ర‌తిపాదిత అంశాల‌ను పంపించాల‌ని సీఎస్ కార్యాల‌యం ఆదేశించింది.
 
బియ్యం సంచి నమూనా పరిశీలన:
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం లబ్ధిదార్లకు ఉచితంగా ఇవ్వనున్న సంచి నమూనాను తాడేప‌ల్లిలోని విడిది కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ బుధవారం పరిశీలించారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ  కమిషనర్, ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్‌ సీఎంకు ఈ నమూనాను చూపించారు.