శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (12:39 IST)

గీత కార్మికుడుకి వైన్‌ షాపుతో పాటు ఇల్లును మంజూరు చేసిన సీఎం (Video)

babu in toddy worker house
ప్రకాశం జిల్లాలో ఓ గీత కార్మికుడుకి అదృష్టదేవత ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. ఆ అదృష్టం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపంలో ఆ గీత కార్మికుడు ఇంటికి వచ్చింది. దీంతో ఆ గీత కార్మిడుకి ఆనందానికి అవధువల్లేకుండా పోయాయి. కడుపేదరికంలో జీవిస్తున్నకార్మికుడికి స్పాట్‌లోనే ఇల్లుతో పాటు వైన్ షాపును కూడా మంజూరు చేయాలని ఆదేశించారు. 
 
తన ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా, తాటి ఆకులతో నిర్మించుకున్న పూరి గుడిసెలోకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఇంటిలో మంచంమీద కూర్చొని గీత కార్మికుల దంపతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పండ్ల వ్యాపారం చేసుకుంటూ వారు తమ ఇద్దరు పిల్లలను ఇంజినీరింగ్ చదివిస్తున్నారని సీఎం తెలుసుకున్నారు. 
 
తమకు ఇల్లు లేదని గీత కార్మికుడు శ్రీను చెప్పడంతో మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే, కల్లుగీత కార్మికులకు 10 శాతం వైన్ షాపులు కేటాయిస్తున్నామని.. అందులో ఆయనకు ఒక దుకాణం ఇవ్వాలని కలెక్టర్‌ను చెప్పారు. వారి కుమారులకు ఉపకార వేతనం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మరో రెండు వందల మందికి కూడా ఇళ్లు లేవని తెలుసుకుని.. అందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.