శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 3 సెప్టెంబరు 2018 (20:54 IST)

జలసిరి సెప్టెంబరు 17 నుంచి ప్రారంభం... సీఎం చంద్రబాబు

సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. " రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 58 వేల కోట్ల రుపాయలు ఖర్చు చేశాము. 11 వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో చెక్‌ డ్యామ్‌ల కోసం ఖర్చు చేశాము. ఉత్తర

సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. " రాష్ట్రంలో  ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 58 వేల కోట్ల రుపాయలు ఖర్చు చేశాము. 11 వేల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో చెక్‌ డ్యామ్‌ల కోసం ఖర్చు చేశాము. ఉత్తరాంధ్ర, రాయలసీమలలో 57 ప్రాజెక్టులు, హంద్రీనీవా, గాలేరు-నగరి, పురుషోత్తపట్నం, తోటపల్లి ప్రాజెక్టులకు ఖర్చు చేశాము. ప్రాధాన్యంగా తీసుకున్న 57 ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభిచాము.
 
17-18 సంవత్సరంలో ఉపాధి హామీలో 10 అవార్డులు జాతీయ స్థాయిలో వచ్చాయి. ఈ దఫా గత ఏడాది కంటే ఎక్కువ అవార్డులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ కరవు, కోస్తాలో తుఫాన్లు ప్రధాన సమస్యలుగా వచ్చాయి. తొలి ఏడాది హుద్ హుద్ ఎదుర్కోవాల్సి వచ్చింది. రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు ఎదురయ్యాయి. సీమపై ఆశ వదులుకునే పరిస్థితిలో ప్రారంభించాము.
 
రాష్ట్రంలో మొత్తం భూమికి నీరిచ్చి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు పోయాము. గోదావరిలో 2018 టిఎంసీల నీరు సముద్రంలోకి కలిసింది. కేవలం 72 టిఎంసిలు మాత్రమే వాడాము. రోజూ 3.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండాయి. 57 ప్రాజెక్టులు చేపట్టాము. 38.16 టిఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా తరలించాము. 33.45 టిఎంసీల నీరు కృష్ణాకు వచ్చింది. 73 సార్లు వర్చువల్, 26 సార్లు ప్రత్యక్షంగా పోలవరంను పరిశీలించాము. 55 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. 
 
పోలవరం కోసం ఇప్పటివరకు 14,607 కోట్లు ఖర్చు చేశాము. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకు ముందు రూ.5 వేల కోట్లు ఖర్చు అయ్యాయి. జాతీయ హోదా వచ్చాక  6727.26 కోట్లు కేంద్రం ఇచ్చింది. 2736.94 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ప్రాజెక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పంపించాము. వాటిని అమోదించాల్సి ఉంది. 
 
భూసేకరణకు 25 వేల కోట్లు ఖర్చు అవుతుంది. పనుల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. 41.15 మీటర్లు మొదటి దశలో పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం 1851 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 6418 మంది తూర్పు గోదావరిలో నిర్వాసితులు అవుతారు. 2709 కోట్లు పునరావాసం కోసం ఖర్చు చేశాము. పశ్చిమ గోదావరిలో 100 శాతం భూసేకరణ పూర్తైంది. రెండో దశలో 42.72 మీటర్ల మట్టానికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం   22,772 కోట్లు కావాల్సి వుండగా ఇందులో తూర్పులో భూసేకరణ చాలా చేయాల్సి ఉంది. పశ్చిమలో భూసేకరణ 100 శాతం పూర్తైంది. తూర్పులో సేకరించాల్సిన 55 వేల ఎకరాలకు 6370 కోట్లు అవసరమవుతాయి. తూర్పులో పరిహారం, పునరావాసానికి  21 వేల కోట్లు, పశ్చిమలో 6 వేల కోట్లు పరిహారం కోసం ఇవ్వాల్సి ఉంది. మొత్తం రెండు జిల్లాల్లో 27 వేల కోట్లు అవసరం అవుతాయి.
 
పోలవరంపై సెప్టెంబర్ 5న కేంద్ర కమిటీ వస్తోంది. ఇప్పటికే వారు అడిగిన అన్ని వివరాలు అందిస్తున్నాము. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. మిగిలిన 57 ప్రాజెక్టులు ఒకవైపు, జలసిరికి హారతి 17,18, 19 తేదీలలో ప్రారంభిస్తాము. అసెంబ్లీ వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెలలో గేట్ల బిగింపు ప్రారంభిస్తాము. వచ్చే మే నాటికి పోలవరం గ్రావిటీ ద్వారా నీటిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు.