మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (11:47 IST)

సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో దాదాపు 6 వేల ఇళ్ల పట్టాలను సుబ్బారెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాల గురించి వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు.

ప్రజా సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. అలా మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై కొన్ని పార్టీల వారు కుట్రలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. 
 
ఇందులో భాగంగానే హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. మంచి కార్యక్రమాలపై బురద చల్లేందుకు విగ్రహాల ధ్వంసం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

దేవుళ్లపై దాడులు చేస్తే దేవుళ్లే శిక్షిస్తారని అన్నారు. శేషాచలం అడవుల్లో జంతువుల సంచారం సర్వసాధారణమని... తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని జరగకుండా రక్షణ చర్యలను చేపడుతున్నామని చెప్పారు.