సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 16 జనవరి 2021 (19:40 IST)

సిఎం జగన్ ఏమిటీ అన్యాయం? టీకా మాది.. ప్రచారం మీదా.. మోడీ ఫోటో ఎక్కడ?

కరోనా వ్యాక్సిన్ టీకా పైన ఇప్పుడు రాజకీయరంగు పులుముకుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాక్సిన్ ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
 
ఈ నియోజకవర్గంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎపిలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఫోటో పెట్టలేదు రాష్ట్రప్రభుత్వం. దీంతో బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
 
కేంద్రం టీకా తీసుకొచ్చింది.. ఉచితంగా అందిస్తోంది. కానీ ప్రచారం రాష్ట్రప్రభుత్వం చేసుకుని.. చివరకు బ్యానర్లలో మోడీ ఫోటో కూడా పెట్టరా అంటూ మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అన్న చందంగా రాష్ట్రముఖ్యమంత్రి తీరు తయారైందంటూ మండిపడుతున్నారు బిజెపి నేతలు.