గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (13:09 IST)

రతన్ టాటా మృతి పట్ల జగన్, తెలుగు సీఎంల సంతాపం

Chandra Babu Naidu
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు  నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. 
 
అలాగే టాటా సన్స్ గౌరవ చైర్మన్, భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రముఖ వ్యక్తి రతన్ టాటా మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.