సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (18:53 IST)

ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల వైఎస్సార్‌ జిల్లా పర్యటన ముగిసింది. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, పథకాల అమలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. 
 
అనంతరం శనివారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. ముందుగా నోవాటెల్‌ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు.