శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 30 మార్చి 2021 (20:08 IST)

గంపెడు వైసిపి ఎంపీలు ఉన్న ఏపీకి ఒరిగింది శూన్యం: శైలజానాథ్

గంపెడు వైసిపి ఎంపిలు ఉన్నా ఎపికి ఒరిగింది శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్. తిరుపతిలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి చింతా మోహన్‌తో కలిసి శైలజానాథ్ మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై జగన్ ఒత్తిడి తీసుకురావాలన్నారు. 
 
ఎపిలో ఒక మాట.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని ఇంకో మాట మాట్లాడటం వైసిపి ఎంపిలకు మాత్రమే తెలుసునన్నారు. ఏ ముఖం పెట్టుకుని బిజెపి, వైసిపి నేతలు తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్‌కు ఉప ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.