గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:57 IST)

ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ లో తెలుగు తేజాలు

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ స్టేడియంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2020-21లో ,  ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. ఇందులో ఎం.తిమ్మరాజప్ప లాంగ్ జంప్ క్రీడలో స్వర్ణ పతాకం, 100 మీటర్ల అంశంలో రాజతపతకం సాధించాడు. చెన్నకేసవరెడ్డి 800 మీటర్ల విభాగంలో రజతం 400 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించారు. తిరుమలరావు (ఓపెన్ విభాగంలో) లాంగుజంప్ లో కాంస్య పతకం. మాధవి షాట్ ఫుట్ లో కాంస్యం సాధించారు.

ఆంద్రప్రదేశ్ క్రీడాకారులు.. ఇన్ని (6)పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. బి.సుజాత సెక్షన్ ఆఫీసర్.  ఏపీ సెక్రటేరియట్  కోచ్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. కోచ్ సుజాత అద్వర్యంలో పతకాలు సాధించడంతో పాటు ఎంతో అభినందనీయం. ఇదే ఉత్సాహంతో రాబోవు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్- 2021-22 లో సుజాత ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని టీం మేనేజర్ కిషోర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.