గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (18:57 IST)

అందుకే తెరపైకి పెగాసస్‌.. RRRపై ఏపీ సర్కారు ప‌రువు న‌ష్టం దావా

ఏపీలో అమ్ముతున్న కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రులకు గతంలోనే లేఖలు రాశానని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. కల్తీ మద్యంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. 
 
కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసస్‌ను తెరపైకి తెచ్చారని అన్నారు. ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్ప, ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పెద్ద సంఖ్యలో జనాలు చనిపోవడంపై కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలు అని చెప్పడం దారుణమని అన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. 
 
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 
 
ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో హానీక‌ర ర‌సాయ‌నాలున్నాయని ఆరోపించిన ర‌ఘురామ‌రాజు ఆ మ‌ద్యం శాంపిళ్ల‌ను చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు జ‌రిపించారు. ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదిక తాజాగా ప్ర‌భుత్వానికి అందింది. 
 
ఈ నివేదిక ప్ర‌కారం ఏపీలో దొరుకుతున్న మ‌ద్యంలో ఎలాంటి హానిక‌ర ర‌సాయ‌నాలున్నాయని తేలలేద‌ని ర‌జ‌త్ భార్గ‌వ తెలిపారు. ప్ర‌భుత్వంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న ర‌ఘురామరాజుపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.