బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (20:41 IST)

ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంఘటనపై గవర్నర్ బిశ్వభూష‌ణ్ దిగ్భ్రాంతి

భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీహెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ, తమిళనాడులో కుప్పకూలిన సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 14 మంది ఉండగా, రావత్ తో సహా 13 మంది మృతి చెందారు. 
 
 
కూనూరు నుంచి విల్లింగ్టన్‌ ఆర్మీ బేస్‌కు వెళ్తున్న ఈ  ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు కూలి పోయింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్  తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.