శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (16:25 IST)

వైద్య ఆరోగ్యశాఖలో దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో వున్న ప్రధానమైన 45 డిమాండ్స్ తక్షణమే పరిష్కరంచాలని కోరుతూ జెఎసీల ఐక్యవేదిక నాయకులు వినితిప‌త్రం స‌మ‌ర్పించారు. బండి శ్రీనివాసరావు, ఛైర్మన్ బొప్పరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి జయధీర్, బి కిషోర్ కుమార్, ఆర్. వి రాజేష్, ఎస్. మల్లేశ్వరరావు, డి ఈశ్వర్, కె సంగీతరావు, కె కళాధర్, ఉల్లి కృష్ణ, ఘంటసాల శ్రీనివాసరావు తదితరులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎం. ర‌విచంద్రకు మెమొరాండం అందజేశారు. వెంటనే  స్పందించి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. 
 
 
జేఏసీ నేత‌ల ముఖ్య డిమాండులు ఇవి....
1. GO No.64 ని ఉపసంహరించి వైద్య శాఖ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో జరిపిన చర్చల ప్రకారం సవరణ ఉత్తర్వులు తక్షణమే ఇవ్వాలి.
2. బోధనా డాక్టర్లకు పిఆర్సిని 1.3.2021 కి బదులు 1.1.2016 నుండి ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి
3.ప్రభుత్వ డాక్టర్లు ప్రొబేషన్ పీరియడ్ ను 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు తగ్గించాలి.
4. శాశ్విత ప్రాతిపదికన స్టాఫ్ నర్సులు నియామకాలు వెంటనే జరపాలి.
5.ఫీల్డ్ సిబ్బందికి బియోమెట్రిక్ విధానాన్ని తీసివేయాలి
6. ఫీల్డ్ స్టాఫ్ తో చేయిస్తున్న దాదాపు 50 రకాల మొబైల్ యాప్ లను ఉప సంహరించుకోవాలి.
7. అర్హత కలిగిన స్టాఫ్ నుర్సులకు, ఎఎన్ ఎం లకు వివిధ స్థాయిలలో పదోన్నతులు తక్షణమే కల్పించాలి.
8. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన GO No.27 ను రద్దు చేసి పాత విధానం ప్రకారం పే, DA, HRA తో వారి జీతభత్యాలు చెల్లించాలి.
 
 
ఇలాంటి 45 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ అందించారు. ముద్దాడ రవిచంద్ర కొన్ని సమస్యలపై అప్పటికప్పుదే స్పందించారు. కింద స్థాయి అధికారులతో నివేదికలు తెప్పించుకుని, వీలైనంత త్వరలో వైద్య ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.