గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:41 IST)

ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జే.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పైగా ఈ ఎన్నికలను కోర్టు ధర్మాసనం సమర్థించింది. దీంతో ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
గత ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనరు నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21వ తేదీన తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగ ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ గురువారం తీర్పును వెలువరించింది.