బోల్తా పడిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం .. ఒకరి మృతి

border road
ఠాగూర్| Last Updated: మంగళవారం, 7 జులై 2020 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనంలోని ఓ వాహనం టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని హయత్ నగర్‌లో సన్‌రైజస్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మంత్రి మరో వాహనంలో ప్రయాణిస్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :